TSPSC క్వశ్చన్ పేపర్ లీకే కేసులో ఖమ్మం దంపతులు సాయిలౌకిక్, సుస్మితల పోలీసు కస్టడీ ముగిసిది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన వీరిద్దరినీ ఇటీవలే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు సిట్ పోలీసులు మూడు రోజులు కస్టడీకి తీసుకొని విచారించారు. శనివారం రోజున ఖమ్మంలో సాయిలౌకిక్ నివాసంలో ల్యాప్‌టాప్, ప్రశ్నపత్రం స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకొని సాయంత్రం చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఖమ్మం ప్రాంతానికి చెందిన పాతకార్ల వ్యాపారి సాయిలౌకిక్ డీఏవో ప్రశ్నపత్రం కొనుగోలు చేసేందుకు ప్రవీణ్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. తన కారును విక్రయించగా వచ్చిన రూ.6లక్షల నగదును ప్రవీణ్ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. మిగిలిన రూ.4 లక్షలు పరీక్ష రాశాక ఇస్తానంటూ ఫిబ్రవరి 23న డీఏఓ క్వశ్చన్ పేపర్ తీసుకున్నారు. అదేనెల 26న పరీక్ష రాశారు. కస్టడీ సమయంలో దంపతులు తామే ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్టు అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఆ క్వశ్చన్ పేపర్‌ను ఎవరికీ ఇవ్వలేదని చెప్పినట్టు సమాచారం.