సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ ఎంపీ, బిజెపి నేత బూర నర్సయ్య గౌడ్. బీసీలను కేసీఆర్ ప్రభుత్వం అణగదొక్కుతుందని ఆరోపించారు. కెసిఆర్ వి ఆత్మీయ సభలు కావని.. ఆత్మవంచన సభలని విమర్శించారు బూర నర్సయ్య. పేపర్ లీకేజీ కేసులో కేటీఆర్ ఇద్దరు వ్యక్తుల ప్రమేయం మాత్రమే ఉందన్నారని.. కానీ ఇప్పుడు సిట్ 50 మందికి నోటీసులు ఇచ్చిందని విమర్శించారు.
ఈ కేసుని సిట్టింగ్ జడ్జితో విచారణ జరపకపోతే ప్రగతి భవన్ పై అనుమానాలు కలుగుతాయన్నారు. సిట్ అంటేనే కెసిఆర్ కిట్ గా వ్యాఖ్యానించారు. ఇక ఏప్రిల్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు బీసీలను చైతన్యపరిచే కార్యక్రమాలు ప్రారంభిస్తామని వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఏకాభిప్రాయం కోసమే పెండింగ్ లో ఉందని అన్నారు.