ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా – రాజగోపాల్ రెడ్డి

మునుగోడు బిజెపి కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకోసం నిలబడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం అధికారం టిఆర్ఎస్ పార్టీ ఎన్నో బెదిరింపులకు పాల్పడిందని.. ఇక్కడే ఉండి ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని అన్నారు.

తనకి అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు తెలిపారు. కాగా మునుగోడు ఉప ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ తన సత్తాని చాటిన విషయం తెలిసిందే. మొదటి మూడు రౌండ్లలో బిజెపి ఆదిక్యం కనబరిచినప్పటికీ.. ఈ పోరులో టిఆర్ఎస్ 11,666 ఓట్ల మెజారిటీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై అధికార పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.