ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వ్యవసాయ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఎమ్మెస్పీ ధరకన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది అనే మాట ఎక్కడ రాకూడదనిని అన్నారు. దీనిని అధికారులు సవాలుగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్రను తీసివేస్తున్నామని స్పష్టం చేశారు. రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ సాగాలన్నారు.
వచ్చే రెండేళ్లలో ప్రతి ఆర్.బి.కె లో డ్రోన్ ఉండేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. భూసార పరీక్షలు చేసే పరికరాలను ప్రతి ఆర్బికె లో ఉంచాలని ఆదేశించారు. మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువులు, విత్తనాలు ఇలా అన్ని రకాలుగా రైతులకు కావలసినవన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. భూసార పరీక్షల కారణంగా ఏ ఎరువులు వాడాలి? ఏంత మేరకు వాడాలన్న దానిపై స్పష్టత వస్తుందన్నారు. దీనివల్ల పెట్టుబడులు తగ్గి దిగుబడులు కూడా పెరుగుతాయి అన్నారు.