చీరలు వద్దంటే మానేయండి, కాని తిట్టొద్దు: ఎమ్మెల్యే

-

బతుకమ్మ పండుగ నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం చీరలను పంచి పెడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణా వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక అధికార పార్టీ ప్రతినిధులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్లి చీరలను పంచి పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి కాస్త ఇబ్బందులు పడుతున్నారు అధికార పార్టీ నేతలు. తాజాగా ఒక ఎమ్మెల్యేకి మహిళలు షాక్ ఇచ్చారు.Choppadandi MLA Sunke Ravishankar - Telangana data

చొప్పదండి నియోజవర్గం గంగాధర మండలంలో చీరెలా పంపిణీలో గందగరగోళం నెలకొంది. పాత చీరలు ఇచ్చారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసారు. మీకు వద్దంటే తీసుకోకండని ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సమాధానం ఇచ్చారు. పేద వాళ్లకు ఇవ్వండని ఆయన పేర్కొన్నారు. చీరెల మీద మాత్రం కామెంట్స్ చేయొద్దు అని ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news