నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా – రాజా సింగ్

-

టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విరుచుకుపడ్డారు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రస్తుత పరిస్థితిలకు టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలే కారణమని అన్నారు. అరెస్టు తర్వాత మొదటిసారి మీడియా ముందుకి వచ్చిన రాజాసింగ్ రాష్ట్రంలో ఆందోళనలు, విధ్వంశాలు చేస్తున్న వారిని ఎంఐఎం పార్టీ విడిపిస్తోందని అన్నారు. మునావర్ షో వద్దని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు రాజా సింగ్. తన గత వీడియోలో మొహమ్మద్ ప్రవక్త పై ఎక్కడ ప్రస్తావించలేదన్నారు.

పాత కేసులలో తనని మరోసారి అరెస్టు చేయడానికి కుట్ర జరుగుతుందన్నారు. తాను అన్నిటికీ సిద్ధపడే ఉన్నానని స్పష్టం చేశారు. మునావర్ ఫరూఖి ప్రోగ్రాం జరగడానికి టిఆర్ఎస్, ఎంఐఎంలు కారణమన్నారు. తను వీడియో రిలీజ్ చేయడానికి కారణం మునావర్ అని తెలిపారు. తను కోర్టు ఆదేశాలు పాటించే వ్యక్తినని అన్నారు రాజా సింగ్.

హిందూ ధర్మం కోసం తన ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధమన్నారు. ఇప్పటివరకు తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించారు. పోలీసులకు ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి సమాధానం చెబుతానన్నారు రాజాసింగ్.

Read more RELATED
Recommended to you

Latest news