ఓల్డ్ సిటీలో ఉండే హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు – అంజన్ కుమార్ యాదవ్

-

రాజసింగ్ చేసిన పనితో రెండు రోజుల నుండి నగరం అతలాకుతలం అవుతోందన్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్. మతమేదైనా, దేవుళ్ళని కించపరచడం తప్పుని అన్నారు. రాజాసింగ్ వ్యాఖ్యలని ఖండిస్తున్నానన్నారు అంజన్ కుమార్ యాదవ్. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ, టీఆర్ఎస్ తమ చర్యలతో తెలంగాణని వేడెక్కిస్తున్నాయని అన్నారు.

ఒకరు ఎన్టీఆర్ సమాధి కూల్చేస్తామని అంటే, ఇంకొకరు ఇంకో సమాధి కుల్చేస్తామని అంటున్నారని.. ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా ఎన్నికల ఎజెండాలో భాగమేనన్నారు. రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చి ఎన్నికల్లో బెన్ఫిట్ పొందుతామని అనుకుంటున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ, ఏంఐఏం కలిసే ఉన్నాయన్నారు అంజన్ కుమార్ యాదవ్. పాతబస్తీలో భయంకర పరిస్థితులు క్రియేట్ చేశారని.. ఓల్డ్ సిటీలో ఉండే హోం మినిస్టర్ ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాం ని డైవర్ట్ చేయడానికే బీజేపీ, టీఆర్ఎస్ కలిసి గేమ్ ఆడుతున్నాయన్నారు

Read more RELATED
Recommended to you

Latest news