నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో ఇవ్వాళ సైతం విద్యార్థులు ధర్నా చేయనున్నారు. 12 డిమాండ్ ల పరిష్కారం కోసం నిన్న రోజంతా విద్యార్థుల నిరసన కొనసాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి. ఉపకులపతి (వైస్ ఛాన్సలర్) విశ్వవిద్యాలయంలోనే ఉండి తమ విధులను నిర్వహించాలి. ఖాళీ ఉన్న పోస్టులను అతి త్వరగా భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
అధ్యాపకుడు విద్యార్థుల నిష్పత్తి సమస్యని పరిష్కారించాలని.. ఐసీటీ (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఆధారిత విద్యాబోధన, పీయూసీ బ్లాక్లను హాస్టల్లను పునర్వ్యవస్థీకరించాలని కోరారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలను అందించాలి (ఉచిత యూనిఫాం, కాట్లు, బెడ్లు), ప్లంబింగ్, ఇంటర్నెట్, విద్యుత్ మొదలైన వనరులను సరైన రీతిలో నిర్వహించాలి, (క్యాంటీన్, బీబీ) టెండర్ల విషయంలో ఏకఛత్రాధిపత్య ధోరణి అంతమవ్వాలి, పిఈడీ, పీఈటీ పోస్టుల భర్తీ. ప్రొక్యూర్మెంట్, వివిధ విద్యాసంస్థలతో కొలబోరేషన్ ఉండాలని డిమాండ్ చేశారు విద్యార్థులు.