ఢిల్లీ: నేడు రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24వ తేదీన ముగియనుండటంతో..ఇటీవల ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
రాష్ట్రపతితోపాటు ఉప రాష్ట్రపతిని కూడా ఒకే సారి ఎన్నుకుంటారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ భారీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులను ఖరారు చేసే పని లో నిమగ్నమయ్యారు. ఈ సారి ఎలాగైన కాంగ్రెస్ అభ్యర్థి రాష్ట్రపతిగా గెలవాలని ఆ పార్టీ భారీ కసరత్తు చేస్తోంది. ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం భారీగా చర్చలు జరుపుతోంది. అలాగే బీజేపీ కూడా తన బలాన్ని మరోసారి చూపించాలని అనుకుంటోంది. వీరితోపాటు ప్రాంతీయ పార్టీలు ఒక్కటై రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలో ఉన్నాయి.