సూర్యాపేట కిడ్నాప్ మైనర్ల పనే..

సూర్యాపేట బాలుడి మిస్సింగ్‌ కధ సుఖాంతయైంది. భగత్‌సింగ్‌ నగర్‌కు చెందిన ఐదేళ్ల కుర్రాడు గౌతమ్ ‌ను గుర్తుతెలియని వ్యక్తి అపహరించుకుపోయాడు. తర్వాత బాలుడి ఇంటి వెనక ఉన్న ఓ మహిళా టైలర్‌ కు ఫోన్‌ చేసి కిడ్నాప్‌ చేసినట్టు సమాచారం ఇచ్చాడు. ఆకాల్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలుడి ని రక్షించారు. పరిచయం ఉన్న వ్యక్తే ప్రధాన సూత్రధారి అని భావిస్తున్నారు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

బైక్‌పై వచ్చి బాలుడి ని నిందితులు ఎత్తుకెళ్లినట్టు తేలింది. తర్వాత మిర్యాల గూడ తీసుకెళ్లి అక్కడి నుంచి హైద్రాబాద్‌కు తీసుకొచ్చారు. పది లక్షలు ఇవ్వాలని పేరెంట్స్‌కు డిమాండ్‌ చేశారు. లేదంటే చంపేస్తామని బెదిరించారు. అయితే డబ్బులు ఇస్తామని నమ్మించి కిడ్నాపర్లను చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్ని గుంటూరులో పోలీసుల పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్ లు అని తేల్చారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.