గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ టీఆర్‌ఎస్-ఎంఐఎం దోస్తీపైనేనా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. దుబ్బాక ఉప ఎన్నిక గెలుసు ఇచ్చిన ఉత్సహంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచింది..ఇప్పటికే రాజకీయ విమర్శలతో టీఆర్‌ఎస్ విమర్శానాస్త్రాలను సందిస్తుంది..ఇటీవలే కురిసిన భారీ వర్షాలు.. వరదలు.. వరదసాయంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి,డ్రైనేజీలో పడి మృతి చెందిన ఘటనలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఎన్నికల ప్రచారణాస్త్రాలుగా మారనున్నాయి..ఇప్పటికే వరదసాయంలో జరిగిన అవినీతిపై ప్రజలతో కలిసి పోరాటం చేస్తుంది బీజేపీ.. గ్రేటర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేఖంగా కలిసి వచ్చే ప్రతి అంశాన్నిరాజకీయంగా ఉపయోగించుకుంటుంది కమలం పార్టీ..
మరోవైపు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
ప్రతి రోజు హైదరాబాద్‌లో విసృత పర్యటన చేస్తున్నారు.. అవకాశం దొరికిన ప్రతిచోట టీఆర్‌ఎస్ విరుచుకుపడుతున్నారు.. నిత్యం ప్రజల్లో ఉంటు కార్యకర్తల్లో ఉత్సహం నింపుతున్నారు.. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డికి ఉన్న ప్రోటోకాల్‌తో రాష్ట్రంలో ఉన్న రాజకీయ అంశాలపై పట్టు సాధిస్తున్నారు.. ప్రతిరోజు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.. అవరమైన సమాచారం పార్టీ పెద్దలకు అందిస్తూ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేఖక బావనను తీసుకువచ్చేలా సహకరిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ అధిస్ఠానం అందుకు అనుగూనంగానే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్ర ఇంచార్జులను నియామిచండంలో తెలంగాణ రాష్ట్రంకు ప్రత్యేక స్థానం కల్పించి కేవలం గ్రేటర్ ఎన్నికల కోసం జాతీయ స్థాయి నేతలను ఇంచార్జులుగా నియామించారు. గుజరాత్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జుగా వ్యవహరించిన భూపేందర్ యాదవ్ను గ్రేటర్ ఎన్నికల ఇంచార్జుగా నియామించారంటే ఈ ఎన్నికలను బీజేపీ అధిస్ఠానం ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థం చేస్తుకొవచ్చు. రాష్ట్ర కమిటీ కూడా ప్రత్యేకంగా గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు కమిటీని ప్రకటించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కన్వినర్‌గా కమిటీ ప్రకటించారు. అధ్యక్షుడు సంజయ్ రాష్ట్ర,జాతీయ కమిటీలు సమన్వయంతో గ్రేటర్ ఎన్నికల్లో విజయడంఖాను మోగించాలని ప్రణాళికలు రచిస్తుంది.
మరోవైపు బీజేపీ గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం, టీఆర్‌ఎస్ రహస్య మధ్య ఒప్పందాలు, గ్రేటర్‌లో వరదసాయంలో జరిగిన అవినీతిపై ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మార్చుకోనున్నాయి. దీంతో గ్రేటర్‌లో 70పైగా సీట్లు గెలుస్తామని అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ముఖ్యంగా బీజేపీ వ్యూహం చాలా స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఓల్డ్ సిటీలో పన్నులపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు ఓల్డ్ సిటీలో హిందువు ఓట్లను తొలగించారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ అంశాలన్ని బీజేపీకి ఎన్నికల ప్రచారాస్త్రాలు కానున్నాయి. గతంలో కాంగ్రెస్‌తోటి ఇప్పుడు టీఆర్ఎస్‌తో ఎంఐఎం దోస్తీ కడుతుంది. ఎవ్వరూ అధికారంలోన్నా ఆ పార్టీతో సంబంధాలు కొనసాగిస్తుండటంతో బీజేపీ ఆరోపణలపై సర్వత్రా అస్తకి కలిగిస్తుంది. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్-ఎంఐఎం దోస్తీపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అదే బీజేపీ చేతిలో ప్రచార ఆయుధంగా మారనుంది.
దాదాపు మేయర్ పీఠాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఎంఐఎం ప్రభావం ఉండనుంది. రెండు పార్టీ మధ్య ఓట్లను చీల్చడం ద్వారా. హిందూ ఓటు శాతాన్ని తమ ఖాతలో వేడుకడం కోసం బీజేపీ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తుంది. మరో వైపు ఈ సారి ఎంఐఎంతో టీఆఎస్ గెలుపునకు ప్రమాదం లేకపోలేదు. ఒక వేళ టీఆర్‌ఎస్ పూర్తిగా ఎంఐఎంపై అధారాపడితే అది పార్టీ మనుగడకే ప్రమాదం అయ్యే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయ,ఆర్థిక నిర్ణయాల్లో ఎంఐఎం ప్రభావం పెరిగితే అది టీఆర్‌ఎస్‌ను కోలుకోని దెబ్బ కొట్టే అవకాశాలు లేకపోలేదు.