దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయండి.. మేం కూడా ఎన్నికలు వెళ్తాం: తలసాని శ్రీనివాస్ యాదవ్

బీజేపీ పార్టీలో కుటుంబ రాజకీయాలు లేవా..? అని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అన్ని రాష్ట్రాల్లో చేసినట్లు వ్యవస్థలను ఉపయోగించుకుని భయపెడితే భయపడటానికి సిద్ధంగా లేరని ఆయన అన్నారు. మీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయండి… మేం కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాం అని ఎవరేంటో తేల్చుకుందాం అని సవాల్ విసిరారు. ఏది పడితే అది మాట్లాడుతే కుదురదని అన్నారు. మీరు దేశానికి ఎనిమిదేళ్లుగా ఏం చేశారని ప్రధానిని ప్రశ్నించారు. రోజుకు డ్రెస్సులు మార్చడం తప్పితే మోదీ చేసిందేం లేదని అన్నారు.

 ముఖ్యమంత్రి దేశంలో బీజేపీకి వ్యతిరేఖంగా చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవుతుందని… మీకు భయం పట్టుకుందని తలసాని విమర్శించారు. కేటీఆర్ ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. వరి ధాన్యం విషయంలో కేంద్రం డ్రామాలు ఆడటం తెలంగాణ ప్రజలు గమనించారని అన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణకు కాదు.. ఆయన నియోజకవర్గం సికింద్రాబాద్ లో ఏం చేశారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఎయిర్ పోర్టులో ఏ ఒక్కరితో కూడా మాట్లాడలేని విమర్శించారు.