తార్నాక ఫ్యామిలీ డెత్ మిస్టరీ.. నిజాలు తేల్చిన పోస్టుమార్టం రిపోర్టు

-

హైదరాబాద్ తార్నాక కుటుంబం అనుమానాస్పద మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా పోస్టుమార్టం నివేదికలో వెల్లడైన విషయాల గురించి తెలిపారు. విజయ్​ప్రతాప్​కు ఇటీవల పదోన్నతి రావటంతో కుటుంబాన్ని చెన్నై తరలిద్దామని భావించి ఆ విషయాన్ని తల్లి జయతి, భార్య సింధూరతో పంచుకున్నాడు. కానీ అక్కడికి వెళ్లడం ఇష్టం లేదని సింధూర తెగేసి చెప్పింది. పలుమార్లు చెప్పినా విజయ్ తరచూ ఆ విషయంలో ఆమెతో గొడవపడేవారు. శనివారం నగరం వచ్చిన ప్రతాప్‌, భార్య, కుమార్తెతో కలిసి ఆదివారం అత్తారింటికి వెళ్లాడు. అక్కడా చెన్నై వెళ్లే విషయం ప్రస్తావించాడు. అనంతరం ఆదివారం రాత్రి అపార్ట్‌మెంట్‌కు చేరారు.

ఇల్లు చేరాక కుటుంబాన్ని చెన్నైకు మార్చుదామంటూ భార్యపై ఒత్తిడి పెంచాడు. అక్కడికి వచ్చేదిలేదని ఆమె చెప్పడంతో జీర్ణించుకోలేకపోయాడు. కోపంతో గట్టిగా కేకలు వేసినట్టు సమాచారం. ఆదివారం అర్ధరాత్రి దాటాక భార్యకు విషమిచ్చాడు. తల్లి ముఖంపై దిండు అదిమి ఊపిరాడకుండా చేశాడు. కుమార్తె మెడకు కరెంట్‌తీగ బిగించి హత్య చేశాడు. ముగ్గురు మరణించారని నిర్ధారణకు వచ్చాక ప్రతాప్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో సింధూర కడుపులో విషం ఉన్నట్టు నిర్ధారించారు. దీన్నిబట్టి పోలీసులు అంచనాకు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news