తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. కాసేపటి క్రితమే తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలను విడుదల చేశారు మంత్రి సబితా. ఈ పదో తరగతి ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, బాలికలు 92.45 శాతం, 87.61 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు.

ఇక టెన్త్ విద్యార్థులు తమ ఫలితాలను www.bse.telangana.gov.in., www.bseresults.telangana.gov.in లో చెక్ చేసుకోవచ్చు. కాగా తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మే 23 నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు కొన‌సాగిన విష‌యం తెలిసిందే. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో 99 శాతం మంది హాజరయ్యారు.