బీజేపీ టీడీపీ పొత్తుకు రంగం సిద్ధమైంది గా ?

-

ఎప్పటి నుంచో టీడీపీ అధినేత చంద్రబాబు కంటున్న కలలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. గతంలో టిడిపి, బిజెపి మధ్య పొత్తు ఉన్న సమయంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారాయి అనే విషయం లో బాబుకు క్లారిటీ వచ్చింది. బీజేపీని దూరం చేసుకోవడం ద్వారా, టిడిపి రాజకీయ పతనానికి నాంది పలికారు అనే అభిప్రాయం బాబులో కనిపిస్తోంది. అందుకే అన్ని వ్యవహారాలను పక్కనపెట్టి బీజేపీకి దగ్గరయ్యేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. బిజెపి కేంద్ర పెద్దలు ఎవరూ, టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఏపీలో సంగతి అలా ఉంటే ,ఇప్పుడు తెలంగాణలో టిడిపి బలం అంతంతమాత్రంగా ఉన్నా, గ్రేటర్ లో ఆ పార్టీకి కాస్తోకూస్తో బలం ఉండడం, సుమారు యాభై డివిజన్లలో ప్రభావం చూపించగల ఓటు బ్యాంకు టిడిపికి ఉండడంతో, తెలంగాణ బిజెపి నాయకులు తెలుగుదేశం పార్టీని కలుపుకు వెళ్లగలిగితే గ్రేటర్ లో బీజేపీ జెండా ఎగురవేసేందుకు అవకాశం దక్కుతుంది అనే అభిప్రాయంలో ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.

TDP BJP partyదీనికి తోడు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో జిహెచ్ఎంసి లో ఉన్నారు. దీంతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తెలుగుదేశం పార్టీని కలుపుకుని వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు గా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ టిఆర్ఎస్ హవాకు ఎక్కడికక్కడ బ్రేకులు వేసి , పై చేయి సాధించాలి అంటే, పొత్తు పెట్టుకోవాల్సిందే అన్న అభిప్రాయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం 150 డివిజన్ లుగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీకి బలమైన సామాజిక వర్గం మద్దతు ఉండడంతో పాటు, 50 డివిజన్లలో ఓటు బ్యాంకును ప్రభావితం చేసే స్థాయిలో బలం ఉండడం వంటి కారణాలే.

గ్రేటర్ మేయర్ పీఠం దక్కించుకోవాలన్న ఆలోచనతో ఉన్న బిజెపి ఇప్పుడు టిడిపికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీలో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి ఎంతగా ప్రయత్నం చేసినా, అది వృధా గా మారిన సమయంలో , ఇప్పుడు స్వయంగా తెలంగాణ లోని గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ సిద్ధం అవుతుండడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం కలిగిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత , గ్రేటర్ ఎన్నికల తంతు ముగిసిన అనంతరం, ఏపీలోనూ పొత్తు పెట్టుకునే విషయంపై కేంద్ర బిజెపి పెద్దలపై ఒత్తిడి పెంచాలనే ఆలోచనలో బాబు ఉన్నట్లు గా సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news