CEIRతో తెలంగాణ సీఐడీ ఒప్పందం.. ఇక నుంచి మొబైల్ పోయినా దొరికేస్తుంది

-

తెలంగాణలో సెల్‌ఫోన్‌ దొంగతనాలకు చెక్‌ పెట్టేందుకు సీఐడీ విభాగం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్ట్రార్‌ (సీఈఐఆర్‌)’తో ఒప్పందం కుదుర్చుకుంది. సీఈఐఆర్​తో ఇకపై చోరీకి గురైన ఫోన్‌ను దొంగల నుంచి ఈజీగా రికవరీ చేయవచ్చు. ఇప్పటివరకు దిల్లీ, ముంబయి, బెంగళూరులలో మాత్రమే అమల్లో ఉన్న విధానం ఇక నుంచి తెలంగాణలోనూ మొదలవ్వనుంది.

సీఈఐఆర్ ఎలా పనిచేస్తుందంటే.. మొబైల్ ఫోన్‌ పొగొట్టుకున్న బాధితుడు ఫోలీసులకు ఫిర్యాదు ఇచ్చి, కేసు నమోదైన తర్వాత సీఈఐఆర్‌ వెబ్‌సైట్లో సంబంధిత వివరాలను నమోదు చేస్తారు. చోరీ అయిన ఫోన్‌ను ఐఎంఈఐ నంబరు ద్వారా బ్లాక్‌ చేస్తారు. అందులో వేరే సిమ్‌కార్డు వేస్తే మనకు ఆ విషయం తెలిసిపోతుంది. దాని ద్వారా కొత్త సిమ్‌కార్డు చిరునామాను తెలుసుకుని, దొంగను పట్టుకోవచ్చు. ప్రస్తుతం ఐఎంఈఐ నంబరు ద్వారా తమ ఫోన్‌ ఎక్కడుందో బాధితులు సొంతంగా తెలుసుకోగలుగుతున్నా… దాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్ళడానికి వారు జంకుతున్నారు. వీటన్నింటికీ దృష్టిలో ఉంచుకొని సీఐడీ విభాగం సీఈఐఆర్‌తో ఒప్పందం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news