కాళేశ్వ‌రం ప‌ర్య‌ట‌న‌లో సీఎం కేసీఆర్

-

  • ప్రాణహిత, గోదావరి సంగమ స్థలి పుష్కర ఘాట్ వద్ద వాయనం సమర్ప‌ణ

హైద‌రాబాద్ః తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాళేశ్వ‌రం ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ లో అక్క‌డికి చేరిన కేసీఆర్‌కు ప‌లువురు రాష్ట్ర మంత్రులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కాళేశ్వ‌రంలోని ముక్తేశ్వ‌ర స్వామి దేవాల‌య‌న్ని సంద‌ర్శించి.. దైవ ద‌ర్శ‌నం చేసుకున్నారు. అనంత‌రం ప్రాణహిత, గోదావరి న‌దుల సంగమ స్థలమైన పుష్కర ఘాట్ వద్ద గోదావ‌రికి జ‌లాల్లో వాయ‌నం స‌మ‌ర్పించారు. దీనిలో భాగంగా పసుపు కుంకుమ, పూలతోపాటు నాణాలు సమర్పించి కేసీఆర్ దంప‌తులు మొక్కును చెల్లించుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ స‌మ‌యంలోనూ, నిర్మాణం చేస్తున్న సంద‌ర్భంలోనూ ఎదురైనా అనుభ‌వాల‌ను కేసీఆర్ మీడియాతో పంచుకున్నారు. తెలంగాణ రైతాంగానికి అండ‌గా నిలుస్తున్న గోదావ‌రి ప్రాణ‌హిత జ‌ల దృశ్యం చూస్తుంటే త‌న‌కు ఎందో సంతోషంగా ఉంద‌ని తెలిపారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో నీటి పారుద‌ల శాఖ అధికారులు, ఇంజినీర్లు, కార్మికుల శ్ర‌మ వెల‌క‌ట్ట‌లేనివ‌నీ, ఈ నిర్మాణం కోసం వారు ఎంత‌గానో శ్ర‌మించార‌ని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, భూపాలపల్లి జడ్పీ చైర్‌పర్సన్ జక్కు హర్షిని స‌హా ప‌లువురు కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. ఇక్క‌డి కార్య‌క్ర‌మం ముగించుకున్న కేసీఆర్.. అనంత‌రం మేడిగడ్డకు బయల్దేరారు.

Read more RELATED
Recommended to you

Latest news