ధాన్యం కొనుగోలుకు రూ. 12వేల కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం

-

తెలంగాణలో ధాన్యం కొనుగోలు కొలిక్కి వచ్చింది. కేంద్రం కొనుగోలు చేయలేని పక్షంలో రాష్ట్రమే కొనుగోలు చేస్తుందని ఇటీవల సీఎం కేసీఆర్ వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం బ్యాంకుల నుంచి రూ. 12 వేల కోట్ల రుణం తీసుకోనుంది. 

రాష్ట్ర వ్యాప్తంగా 6983 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కోతలు మొదలైన 536 కేంద్రాలు ఏర్పాటు చేసి 1200 టన్నుల మేర ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మరోవైపు రైతులకు చెల్లించేందుకు పౌరసరఫరాల శాఖ రూ. 4350 కోట్లు సిద్ధం చేసింది. ఇదిలా ఉంటే కేంద్రం కూడా ‘ రా’ రైస్ తీసుకునేందుకు సిద్ధం అని ప్రకటించింది. రాష్ట్రం నుంచి 40.20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాయిల్డ్ రైస్ కాకుండా… సాధారణ బియ్యం ఎంత ఇచ్చినా తీసుకుంటామని కేంద్ర అధికారులు, రాష్ట్ర అధికారులకు లేఖ రాశారు. సెప్టెంబర్ చివరి నాటికి బియ్యం ఇవ్వాలని లేఖలో స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news