రాజ్​భవన్​లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన గవర్నర్ తమిళిసై

-

తెలంగాణ సంబురం బతుకమ్మ పండుగ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక మాత్రమే కాదు.. బతుకమ్మలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బతుకమ్మ వేడుకను పురస్కరించుకుని రాజ్ భవన్ లోని మహిళా ఉద్యోగులు, సిబ్బందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. చీరలు అందుకున్న మహిళా ఉద్యోగినులు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

“బతుకమ్మలో సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరూ సంతోషకర వాతావరణంలో, కుటుంబసభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవాలి.” – తమిళిసై, గవర్నర్

తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మహిళలంతా ఈ బతుకమ్మ పండుగను తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news