హ్యాట్సాఫ్ చిన్నదొరా.. కేటీఆర్‌ ట్వీట్‌కు షర్మిల సెటైర్

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై మరోసారి వైఎస్‌ షర్మిల సెటైర్లు పేల్చారు. 18 లక్షల మంది కౌలు రైతులను అసలు రైతులే కాదని.. 67 లక్షల మందికి రైతుబంధు ఇస్తూ.. 37 లక్షల రైతులకు మాత్రమే రైతుబీమా కట్టి.. మిగతా 30 లక్షల మంది రైతులు చచ్చినా పర్వాలేదని.. వాళ్ళు రైతుబీమాకు పనికి రారని.. ఆ రైతులు మరణిస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వారిని ఆగం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

రైతులను ఆదుకుంది మేమే అని జబ్బలు చరుచుకొంటూ.. రైతులు అందరికీ బీమా ఇస్తున్నామని కండ్లు ఆర్పకుండా అబద్ధాలు చెబుతూ, పట్టపగలే రైతులను నిలువునా మోసం చేస్తూ .. మేము పెద్ద రైతులమని చెప్పుకు తిరుగుతున్నారని కేటీఆర్‌ పై నిప్పులు చెరిగారు. మీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చిన్న దొర అంటూ కేటీఆర్‌ పై సెటైర్లు పేల్చారు. ఎనిమిదేండ్లుగా కేసీఆర్ ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగింది. ప్రజలు కష్టాల్లో ఉన్నా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏనాడూ ప్రశ్నించలేదు. అందుకే YSR తెలంగాణ పార్టీ పుట్టింది. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి, YSR సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే మా లక్ష్యమన్నారు షర్మిల.

 

Read more RELATED
Recommended to you

Latest news