ఫ్లాండర్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడ్ సంస్థతో తెలంగాణ ఒప్పందం

-

తెలంగాణ సిగలో మరో అంతర్జాతీయ పెట్టుబడి చేరింది. పెట్టుబడుల స్వర్గధామంగా తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. మరో అంతర్జాతీయ సంస్థ ఫ్లాండర్స్ ఇన్వెస్ట్​మెంట్ అండ్ ట్రేడ్ సంస్థ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు.

లైఫ్‌సైన్సెస్ రంగంలో పలు అవకాశాలపై దృష్టిసారిస్తూ ఫ్లాండర్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడ్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో జరుగుతున్న బయోఆసియా సదస్సులో బెల్జియంకు చెందిన ప్లాన్డర్ సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ని కలిశారు. సదస్సులో తొలిరోజు ఫ్లాండర్స్‌ప్రతినిధి బృందం.. పలు సమావేశాల్లో పాల్గొంది. హైదరాబాద్‌లోని జినోమ్‌ వ్యాలీలో క్లస్టర్ టు క్లస్టర్ కోలాబరేషన్స్‌ చేస్తూ లైఫ్‌సైన్సెస్ రంగంలో ఫ్లాండర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news