Telangana: లోన్ యాప్ ఎఫెక్ట్.. దివ్యాంగుడి ఆత్మహత్య!

-

లోన్‌ యాప్స్‌ ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఈఎంఐలు చెల్లించలేక దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఆన్లైన్లో తీసుకున్న లోన్ల ఈఎంఐలు చెల్లించలేక,యాప్ల నిర్వాహకుల ఒత్తిళ్లను తట్టుకోలేక దివ్యాంగుడైన ఓ రేషన్ డీలర్ భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది.

telangana, loan app

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగ గ్రామానికి చెందిన గొడిశాల పైడయ్య (40) ఆన్లైన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకున్నాడు.ఆర్థిక పరిస్థితులు బాగులేక ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో లోన్లు ఇచ్చిన యాప్ల నిర్వాహకుల ఒత్తిళ్లు పెరిగాయి.దీంతో రేషన్ షాప్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మధ్యాహ్నం కావస్తున్నా ఇంటికి రావడంతో షాపు వద్దకు తల్లి వెళ్లి చూసింది.ఫ్యాన్ కు వేలాడుతూ కొడుకు కనిపించడంతో కేకలు వేసింది. చుట్టుపక్కలవారు వచ్చి కిందికి దింపగా అప్పటికే పైడయ్య మృతి చెంది ఉన్నాడు.లోని యాప్ల నిర్వాహకుల ఒత్తిళ్ల తోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అతడి జేబులో సూసైడ్ నోట్ లభ్యమైంది.

Read more RELATED
Recommended to you

Latest news