హైదరాబాద్ శివారులో మాజీ ఎంపీటీసీ దారుణ హత్య..అక్రమ సంబంధమే !

-

హైదరాబాద్‌లో రోజు రోజుకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. హైదరాబాద్ శివారులో మాజీ ఎంపీటీసీ దారుణ హత్యకు గురయ్యారు. ఘట్కేసర్ PS పరిధిలో ఉండే మహేశ్ (40) ఈ నెల 17న బయటకువెళ్లి తిరిగిరాలేదని ఆయన సోదరుడు విఠల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Brutal muder of former MPTC in Hyderabad suburbs

తాజాగా ఎన్ఎఫ్సి నగర్ డంపింగ్ యార్డు వద్ద మహేశ్ మృతదేహం గుర్తించారు. అక్రమ సంబంధం కారణంగా మాజీ ఎంపీటీసీ మహేష్‌ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 17 న కుటుంబ సభ్యుల ఫిర్యాదు తో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు…ఎన్ఎఫ్సి నగర్ డంపింగ్ యార్డు వద్ద మహేశ్ మృతదేహం గుర్తించారు.

విచారణలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నిందితులు గడ్డం మహేష్ ను హత్య చేసి ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో పాతి పెట్టినట్లు గుర్తించారు పోలీసులు. ఇక పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news