BREAKING : తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

-

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది ప్రభుత్వం. కాసేపటి క్రితమే ఎంసెట్ మరియు ఈసెట్ పరీక్ష తేదీలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. జూలై మాసం 14వ తేదీ, 15వ తేదీ, 18,19 ,20 తేదీలలో పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు.

జులై 14 మరియు తేదీలలో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. జులై 18, 19, 20 తేదీలలో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇక జూలై 13 వ తేదీన ఈసెట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కాగా తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్షలు…మే 6 వ  తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.  జే ఈ ఈ పరీక్షల నేపథ్యంలో… ఈ సారి ఇంటర్ పరీక్షలు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news