నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉన్న రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలిదశలో హైదరాబాద్-వరంగల్, మలిదశలో హైదరాబాద్-విజయవాడ మధ్య ఈ ట్రాన్సిట్ కనెక్టివిటీ అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం ఢిల్లీ-ఘజియాబాద్-మీ రెడ్డి మార్గంలో రీజన్ నెల రాపిడ్ ట్రాన్సిట్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆర్ ఆర్ టి ఎస్ విధానం రెగ్యులర్ రైల్వే నెట్వర్క్, సబర్బన్ మెట్రో రైల్ లకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రెండు నగరాల మధ్య వేగంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రత్యేక ట్రాక్ లను, నియంత్రణ మార్గాలను నిర్మిస్తారు.
ఈ మార్గంలో రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది. అంటే ఈ లెక్కన ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలంటే కేవలం గంట సమయం మాత్రమే పడుతుంది. దీనిపై త్వరలోనే ప్రకటన రానున్నట్లు సమాచారం అందుతోంది.