ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నిన్నటి వేళ హఠాన్మరణం చెందారు.గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.కుటుంబసభ్యు
నిన్నటి వేళ ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన వారిలో సీఎం జగన్, తెలంగాణ మినిస్టర్స్ కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ఇంకా ఇంకొందరు,జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు,మేకపాటి బంధువు, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇంకా ఇంకొందరు హైద్రాబాద్ కు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి,వారిని ఓదార్చారు.
ఇక తాజా వివాదం ఏంటంటే…
మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోవడంతో విజయవాడ నుంచి హైద్రాబాద్ కు చేరుకున్న మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తదితరులు అక్కడే ఉండి నవ్వులు చిందించారని ఆరోపణలు వస్తున్నాయి. విపక్ష పార్టీ నేత అయ్యన్న పాత్రుడు ఈ మేరకు సంబంధిత వీడియో ఒకటి ట్వీట్ కూడా చేశారు. ఓ వైపు అంతా విషాదంలో ఉంటే మరోవైపు బాధ్యత మరిచి మంత్రితో సహా ఆయన స్నేహితులు చావు ఇంట నవ్వులు పూయిస్తున్నారని ఆవేదన చెందారు.
ఒక్క పక్కన, తమ సహచర మంత్రి శవం ఉంది. కేవలం 49 ఏళ్ళు హటాత్తుగా చనిపోయాడు.
అయినా ఏ మాత్రం బాధ లేకుండా, @IamKodaliNani, @DrVVamsi ఎలా నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ, వెకిలి వేషాలు వేస్తున్నారో చూడండి.
ఇలాంటి వారిని సైకోలు అనాలా ? ఏమనాలి ? pic.twitter.com/lENXA6zb59— Ayyanna Patrudu (@AyyannaPatruduC) February 21, 2022