తెలంగాణ ప్రజలకు అలర్ట్.. 3 రోజుల పాటు భారీ వర్షాలు

-

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్‌ పర్యటన ఖరారు అయింది. నేడు మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 10:30కి మూసాపేట మండలం వేములలో కోజెంట్ పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news