నేడు మహబూబ్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన

-

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్‌ పర్యటన ఖరారు అయింది. నేడు మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 10:30కి మూసాపేట మండలం వేములలో కోజెంట్ పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.

అనంతరం మహబూబ్ నగర్ లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు భూమిపూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత అయ్యప్పగుట్ట సమీపంలోని వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం జడ్చర్లకు చేరుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ప్రారంభోత్సవం చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాగా.. నిన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్… ములుగు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. ములుగు నియోజక వర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news