తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణలో ఇవాళ కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కలగతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. KMM, NLG, సూర్యపేట, భువనగిరి, జనగామ, సిద్దిపేట, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది.
నిజామాబాద్, భద్రాద్రి, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు హైదరాబాద్ నగరంలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నగరవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ.. జోన్లవారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, ఎల్బీనగర్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.