వరంగల్‌ పట్టణానికి అరుదైన గౌరవం..దేశ చరిత్రలోనే తొలిసారి

-

వరంగల్ నగరానికి అరుదైన గుర్తింపు దక్కింది. ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ గుర్తించిన అభ్యాసన నగరాల ప్రపంచ నెట్వర్క్ లో వరంగల్ నగరానికి చోటు లభించింది. యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ లో వరంగల్ చేరిందంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం రాత్రి ట్వీట్ చేశారు.

భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు వరంగల్, తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

దీనిపై తెలంగాణ పంచాయతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేస్తూ ఓరుగల్లు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గుర్తింపు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు, మంత్రి కేటీఆర్ కు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news