ఆ ఘనత సీఎం కేసీఆర్ కే దక్కింది – ఎమ్మెల్సీ కవిత

-

రాష్ట్రంలో రైతుల కోసం సంఘాలు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నేడు కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం పద్మాజీవాడిలో రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తెలంగాణ రైతులను పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండేవని.. ప్రస్తుతం రాష్ట్రంలో నకిలీ విత్తనాలు లేవని, రైతులకు కరెంటు సమస్యలు లేవని పేర్కొన్నారు.

రాష్ట్రంలో రైతులకు మర్యాద తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు కల్వకుంట్ల కవిత. వరి సాగులో తెలంగాణ దేశంలో రెండవ స్థానంలో నిలిచిందన్నారు. సరిహద్దులో జవాన్.. పంట పొలంలో రైతు.. ఈ ఇద్దరి వల్లే మనం ప్రశాంతంగా జీవిస్తున్నామని అన్నారు. వ్యవసాయం అంటే దండగ అన్న స్థితి నుండి పండగానే స్థాయికి తీసుకువచ్చామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news