ఢిల్లీకి బాబు..బీజేపీతో పొత్తు కాదు..సంచలన ట్విస్ట్.!

-

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీని ఓడించడానికి టి‌డి‌పి, జనసేన పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. అయితే జనసేన ప్రస్తుతం బి‌జే‌పితో కలిసి ఉంది. బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో పొత్తుకు రెడీగా లేదు. అదే సమయంలో కేంద్రం..పరోక్షంగా జగన్‌కు సాయం అందిస్తుంది. ఇప్పటికే పలుమార్లు జగన్ ఢిల్లీ టూర్‌కు వెళ్ళిన విషయం తెలిసిందే.

బి‌జే‌పి పరోక్షంగా జగన్ వైపే ఉందనే సంకేతాలు వచ్చాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు సాయంత్రం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాని బాబు కలవనున్నారు. నెక్స్ట్ పి‌ఎం మోదీని సైతం కలిసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం వస్తుంది.

ఇలా బాబు బి‌జే‌పి పెద్దలని కలుస్తుండటంతో..టి‌డి‌పితో పొత్తుకు బి‌జే‌పిని అడుగుతున్నారని ప్రచారం వస్తుంది. అసలు పొత్తు గురించే టాపిక్ లేదని, ఏపీ రాజకీయాలకు సంబంధించిన భేటీ కూడా కాదని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. జీ20 సన్నాహక సదస్సులో భాగంగా ఢిల్లీలో జరిగే సదస్సుకు చంద్రబాబు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే కేంద్రంలోని ముఖ్య నేతలతో సమావేశం ఉందని చెబుతున్నారు.

జీ20 సదస్సులో భాగంగా పలు విభాగాలు..అంశాల పైన సన్నాహక సదస్సులు నిర్వహిస్తోంది. ఈ సదస్సులో భాగంగానే ప్రధాని, హోం మంత్రితో ఆ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని సమాచారం. అయితే ఒడిశాలో రైలు ప్రమాదం నేపథ్యంలో సమావేశం జరుగుతుందా? వాయిదా పడుతుందా? అనేది చూడాలి. అయితే బాబు ఢిల్లీకి వెళ్ళేది పొత్తుల గురించి కాదని, జీ-20 సమావేశాలకు సంబంధించే వెళుతున్నారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news