షేజల్ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

తనను వేధిస్తున్నాడని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై ఆరోపణలు చేసిన బాధితురాలు షేజల్ దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే పక్కన ఉన్నవారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నాడని షేజల్ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తుంది.

తనని మానసికంగా, లైకంగా వేధిస్తున్నారని ఆయనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కి సైతం ఫిర్యాదు చేసింది షేజల్. అయితే షేజల్ ఆత్మహత్యాయత్నం, ఆరోపణల పై తాజాగా స్పందించారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసిందో తనకు తెలియదన్నారు. ఆరిజన్ డైరీ మోసాల పై రైతులను అడిగితే తెలుస్తుందన్న ఆయన.. తనపై షేజల్ పదేపదే ఆరోపణలు చేస్తుందన్నారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు.