విద్యార్థులు ప్రైవేట్ కళాశాలకు వెళ్లడానికి అసలు కారణం అదే : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

తెలంగాణలో ఇంటర్, డిగ్రీ కళాశాలలు జూన్ 1 నుంచి ప్రారంభం అయ్యాయి. కానీ 35 శాతం స్టాఫ్ గెస్ట్ లెక్చరర్స్ ని రెన్యువల్ చేయలేదని  మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీంతో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు వెళుతున్నారని, వెంటనే సమస్య పరిష్కారం చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలి కోరారు.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని తెలిపారు. పర్మినెంట్ లెక్చరర్లు లేని కళాశాలలు 25 ఉన్నాయని చెప్పారు. మూడు వేల మంది గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో వారు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. తక్షణమే వాళ్లకు జీత భత్యాలు పెంచాలని వెల్లడించారు. తమ హయంలో అనేక ప్రభుత్వ కళాశాలు మంజూరు చేశామమన్నారు. విద్యార్థి జీవితంలో ఇంటర్ మీడియట్ చాలా కీలకం ప్రైవేటు కళాశాలలు వ్యాపార ధోరణితో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news