తెలంగాణలో 18 జిల్లాలు రద్దు చేస్తే జరిగే పరిణామాలు ఇవే?

-

తెలంగాణలో 18 జిల్లాలు రద్దు కానున్నాయట. ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాలను ప్రకటించనుందట కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సంచలన వార్తను ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ నిర్ణయం అమలైతే ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు రద్దు అవుతాయి.

These are the consequences if 18 districts in Telangana are cancelled

కొత్త జిల్లాల పునర్విభజన చేస్తే జరిగే పరిణామాలు:

  1. రద్దు చేయబోయే జిల్లాల్లో వ్యవసాయ భూముల ధరలు పడిపోయి రైతులకు తీవ్ర నష్టం. రియల్ ఎస్టేట్ కూడా ఢమాల్.
  2. జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల రద్దు, మళ్ళీ భారీ బదిలీలు. ప్రభుత్వ యంత్రాంగం అస్తవ్యస్తం.
  3. 3విద్యార్థుల పాఠ్యాంశాలు, కేంద్ర, రాష్ట్ర శాఖల పునర్వ్యవస్థీకరణ చేయాలి, ఉన్న మ్యాప్ లన్ని తిరగరాయాలి
  4. పోటీ పరీక్షల సిలబస్ మార్చాలి. జోనల్ విధానం మార్చాలి. రెండేళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వీలు కాదు.
  5. ఇప్పుడున్న జిల్లా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలు ఇతర జిల్లా కేంద్ర ఆఫీస్ నిర్మాణాలు నిరుపయోగం.

Read more RELATED
Recommended to you

Latest news