సిగ్గురాని ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల గోస పట్టదు – వైఎస్ షర్మిల

-

తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. టీఎస్పీఎస్సీ లో లీక్ అయినవి 15 పేపర్లు, రద్దు అయినవి 6 పరీక్షలు, రోడ్డున పడ్డది 10లక్షల మంది నిరుద్యోగులు.. కానీ ‘కీలక నిందితులు’ అని తేల్చింది ఇద్దరిని మాత్రమే అని ఆరోపించారు. ఇదీ చిన్న దొర ఆధ్వర్యంలో నడిచిన సిట్ రిపోర్టు. గతంలో డ్రగ్స్ కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులాగే TSPSC ప్రశ్నాపత్రాల కుంభకోణాన్ని సిట్ నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు.

ఒక్క పేపర్ లీక్ అయితే బయటికి పొక్కే విషయం, 15 పేపర్లు లీక్ అయ్యేదాకా బయటకు రాలేదంటే ఇందులో ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదంటారా? అని ప్రశ్నించారు. “సర్వర్ నుంచి పేపర్స్ లీక్ అయ్యాయంటే ముఖ్యమైన మంత్రి KTR ప్రమేయం లేదంటారా? ఇంత జరిగినా బోర్డును ప్రక్షాళన చేయలేదంటే ఇంకా కొలువులు అమ్ముకునే ఉద్దేశం మీకుందా? మీరు నిర్దోషులైతే సీబీఐ దర్యాప్తుకు ఎందుకు భయపడుతున్నట్లు? నిరుద్యోగుల జీవితాలతో చలగాటం ఆడుతున్నారా? కొలువులు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా సిగ్గురాని ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల గోస పట్టదు.

నిరుద్యోగుల కోసమే T-SAVE ఏర్పడింది. విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం జరిగే దాకా పార్టీలకు అతీతంగా T-SAVE పోరాడుతుంది. ఇందులో నిరుద్యోగులు, విద్యార్థులు సైతం భాగస్వాములై ఈ నెల 17న ఇందిరాపార్క్ వద్ద జరిగే నిరాహార దీక్షకు పెద్ద ఎత్తున తరలివచ్చి, ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలి” అన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news