తెలంగాణ రైతులకు బిగ్ షాక్..ఈ సారి ఆ 7 లక్షల మందికి రైతుబంధు కట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది వానాకాలం సీజన్ లో 70.54 లక్షల మంది రైతులకు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు వేసింది.
ఈ సారి యాసంగి సీజన్ రైతు బంధు మాత్రం 63 లక్షల మంది రైతులకు మాత్రమే ఫిబ్రవరి నెలాఖరు వరకు వేస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంటే ఈ లెక్కన ఈ సారి ఆ 7 లక్షల మందికి రైతుబంధు కట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఇదే జరిగితే.. కాంగ్రెస్ సర్కార్ కు గడ్డు కాలం ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. కేసీఆర్ పాలనలో ప్రతి రైతుకు.. ఒక్క ఎకరం పోకుండా రైతు బంధు అమలు చేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక…రైతులకు అనేక కష్టాలు వస్తున్నట్లు చెబుతున్నారు.