టీఆర్ఎస్ పై తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్టీలో ద్రోహులు ఉన్నారు !

-

ఖమ్మం జిల్లా ; మాజీ మంత్రి తుమ్మల మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేలకొండపల్లి మండలం చెరువు మాదారం లో పర్యటించిన మాజీ మంత్రి తుమ్మల.. టిఆర్ఎస్ పార్టీ పై కామెంట్స్ చేశారు. రాజకీయంగా శత్రువులను నమ్మచ్చు గాని రాజకీయ ద్రోహులు మాత్రం నమ్మవద్దని పేర్కొన్నారు.

శత్రువులు పక్క పార్టీలోకి వెళ్ళి పోతారు కానీ ద్రోహులు మాత్రం పార్టీకి ద్రోహం చేసి ఓడిస్తారని నిప్పులు చెరిగారు. ద్రోహాన్ని మీరు చూసుకోండి మళ్ళీ మీ ముందుకు నేనువస్తా అంటూ కామెంట్ చేశారు మాజీ మంత్రి తుమ్మల. నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి పథంలో ఉంచేందుకు అన్ని పథకాలను అమలు చేశానని వెల్లడించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఉదార స్వభావం తో పాలేరు నియోజకవర్గం తో పాటు ఖమ్మం జిల్లా కి ఇచ్చిన అభివృద్ధి పథకాలను పూర్తి చేసే బాధ్యత నాది అంటూ మాజీ మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. మిగిలి ఉన్న అభివృద్ధి పనులను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి పూర్తి చేస్తానని… ప్రజలు తనకు ఇచ్చిన అపూర్వ స్వాగతనికి జన్మ జన్మల రుణపడి ఉంటానని వెల్లడించారు మాజీ మంత్రి తుమ్మల..

Read more RELATED
Recommended to you

Latest news