దేశంలో మార్పు రావాల్సిన సమయం వచ్చింది – సీఎం కేసీఆర్

-

నేడు మహారాష్ట్ర నాందేడ్ లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పలువురు నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరికయ్యారు. పార్టీ కండువాలు కప్పి సీఎం వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మహిళా నేతలకు ఎమ్మెల్సీ కవితా కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఇక బహిరంగ సభ వేదికపై చత్రపతి శివాజీ, అంబేద్కర్, పూలే విగ్రహాలకు నివాళి అర్పించిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడుతూ.. దేశ పరిస్థితులను చూసి టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చినట్లు వెల్లడించారు.

దేశంలో మార్పు రావలసిన సమయం వచ్చిందన్నారు కేసీఆర్. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ.. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎన్నో మాటలు చెప్పారు కానీ మార్పులు జరగలేదన్నారు. ఇన్నేళ్ల స్వతంత్ర దేశంలో ప్రజలకు కనీసం తాగునీరు, విద్యుత్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. అన్నదాత ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. దారులన్నీ మూసుకుపోయి ఏ ఆసరా లేనప్పుడే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news