ఏపీలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో క్లారిటీ లేకుండా ఉంది..టిడిపి-జనసేన-బిజేపిల మధ్య పొత్తు అంశంలో పెద్ద రచ్చ నడుస్తోంది. అధికార వైసీపీ ఎలాగో ఒంటరిగా బరిలో దిగుతుంది. అయితే ఆ పార్టీకి చెక్ పెట్టాలని టిడిపి చూస్తుంది. కాకపోతే జనసేన ఓట్లు చీలుస్తుందనే భయం టిడిపిలో ఉంది. అందుకే జనసేనని కలుపుని వెళ్లాలని చూస్తుంది. ఇటు జనసేన సైతం టిడిపితో కలిస్తే కొన్ని సీట్లు వస్తాయి..అటు వైసీపీకి చెక్ పెట్టినట్లు ఉంటుందని ఆలోచిస్తుంది.
టిడిపి-జనసేన కలిస్తే వైసీపీకి మాత్రం రిస్క్ పెరుగుతుంది. కాకపోతే రెండు పార్టీల పొత్తు దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తుంది గాని..మధ్యలో బిజేపి ట్విస్ట్‌లు ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బిజేపి-జనసేన పొత్తులో ఉన్నాయి. జనసేన ఏమో టిడిపితో కలవాలని చూస్తుంది. బిజేపి ఏమో టిడిపితో కలిసే ప్రసక్తి లేదని అంటుంది. దీంతో పవన్ బిజేపిని వదిలేసి టిడిపితో కలిసి ముందుకెళ్తారని తెలుస్తోంది. బిజేపి కలిసొస్తే ఓకే లేదంటే టిడిపితో కలవడానికి పవన్ రెడీగా ఉన్నారు. టిడిపి కూడా కలవకపోతే ఒంటరిగా పోటీ చేస్తామని అంటున్నారు.
ఇదిలా ఉండగానే బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన చూస్తే..ఇంకా జనసేనతో పొత్తుని లైట్ తీసుకున్నారని అర్ధమవుతుంది. రాబోయే రోజుల్లో ఏపీలో బీజేపీ కీలకం కానుందని, అప్పుడు మీడియా అంతా తమ వెనుకే తిరుగుతుందని, బీజేపీకి జనంతోనే పొత్తు అని, జనసేన కలిసి వస్తే.. వారితోనూ పొత్తు ఉంటుందని వివరించారు.
అంటే జనసేన కలిసి వస్తే ఓకే లేదంటే తమ దారి తమదే అన్నట్లు సోము ప్రకటన ఉంది. అంటే టిడిపితో కలవడానికి రెడీగా ఉన్న పవన్..బిజేపి కూడా కలిస్తే ఓకే..లేదంటే బిజేపిని లైట్ తీసుకునేలా ఉన్నారు.