మందుబాబులకు షాక్..ఇవాళ, రేపు వైన్స్ షాపులు బంద్

మందుబాబులకు బిగ్‌ షాక్ తగిలింది. ఇవాళ, రేపు వైన్స్ బంద్ కానున్నాయి. అయితే.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కాదండోయ్‌. కేవలం హైదరాబాద్‌ మహా నగరంలో మాత్రమే ఇవాళ, రేపు వైన్స్ బంద్ కానున్నాయి.

ఇవాళ హైదరాబాద్‌ లోబోనాల పండుగ ఘనంగా జరుతోంది. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని.. హైదరాబాద్‌ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి వైన్స్ షాపులు యథావిధిగా ప్రారంభం కానున్నాయి.

ఇక అటు తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా  తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీకగా నిలుస్తాయని సీఎం అన్నారు.  ఎడతెరిపి వానలు, వరదల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.