ఏపీకి హెచ్చరికలు జారీ చేసింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో మాండూస్ తుఫాన్ తీరం దాటిందని సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.
దీని ప్రభావంతో ఈరోజు ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందనిరేపు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. తుఫాను తీరం దాటినప్పటికి రేపటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల సంస్థ హెచ్చరించింది. ఇక ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.