తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహారాష్ట్ర లో గల కొల్లాపూర్ శక్తి పీఠాన్ని సీఎం కేసీఆర్.. కుటుంబ సమేతంగా వెళ్లి దర్శించుకోనున్నారు. కాగ దేశంలో ఉన్న శక్తి పీఠాల్లో కొల్హాపూర్ శక్తి పీఠం ఒక్కటి. అష్టా దశ శక్తి పీఠాల్లో కొల్హాపూర్ శక్తి పీఠాన్ని ఏడో శక్తి పీఠంగా చెబుతారు. కాగ ఈ కొల్హాపూర్ శక్తి పీఠంలో లక్ష్మీ దేవీ అమ్మ వారు కొలువై ఉన్నారు. కాగ నేడు సీఎం కేసీఆర్.. కుటుంబ సమేతంగా కొల్హాపూర్ శక్తి పీఠంలో ఉన్న లక్ష్మీ దేవీ అమ్మవారిని దర్శించుకోనున్నారు.
అనంతరం సాయంత్రం హైదరాబాద్ కు తిరుఉగు ప్రయాణం అవుతారు. కాగ రైతుల మద్దతుగా దేశ వ్యాప్త పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్న సీఎం కేసీఆర్ లక్ష్మీ దేవీ అమ్మ వారి దీవనలను తీసుకోనున్నారు. అలాగే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి కూడా అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్త పోరాటానికి, జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా గతంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కూడా కలిసిన విషయం తెలిసిందే.