విజయ్ సేతుపతి ‘మామనితన్’ చిత్ర విడుదల మరోసారి వాయిదా!

-

కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన చిత్రాలకు మంచి ప్రేక్షక ఆదరణ ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మక్కల్ సెల్వన్..హీరోగా నటిస్తూనే కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే పలు చిత్రాల్లో నెగెటివ్ రోల్స్ ప్లే చేస్తున్నాడు.

తెలుగులో ‘ఉప్పెన’ చిత్రంలో ఆయన పోషించిన ప్రతికథా నాయకుడి పాత్రకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఈ సంగతులు పక్కనబెడితే.. జాతీయ అవార్డు గ్రహీత శ్రీను రామస్వామి దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మామనితన్’. ఈ ఫిల్మ్ రిలీజ్ ఎప్పుడు అవుతుందా? అని ప్రేక్షకులు మూడేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. కొవిడ్ పరిస్థితుల వలన ఈ చిత్ర విడుదల పోస్ట్ పోన్ అవుతూనే వస్తున్నది.

మే 6న సినిమా విడుదలవుతుందని వార్తలొచ్చాయి. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరోసారి సినిమా విడుదల వాయిదా పడుతుందని వినికిడి. అయితే, ఈ విషయమై మేకర్స్ ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు. ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుండగా ఇందులో ఆటో డ్రైవర్ పాత్రను విజయ్ సేతుపతి పోషిస్తుండగా, ఆయనకు జోడీగా గాయత్రి శంకర్ నటిస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా? అని సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల విజయ్ సేతుపతి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెర్రీ క్రిస్టమస్’ చిత్ర షూటింగ్ పూర్తి చేశారు. లోకేశ్ కనకరాజ్- కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కిన ‘విక్రమ్’ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news