మరికాసేపట్లో భారీ వర్షం..హైదరాబాద్ నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు

-

హైదరాబాద్‌ నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు పోలీసులు. 9 నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం ఉందని.. ఈ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. వాహనదారులు గంట ఆలస్యంగా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచనలు చేశారు పోలీసులు.

వర్షం తగ్గిన గంట తర్వాత వాహనదారులు బయటికి రావాలని సూచనలు చేశారు. వరద నీరు భారీగా రోడ్లపై చేరితే ట్రాఫిక్కు అంతరాయం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొన్ని ముఖ్యమైన రోడ్లలో వాహనదారులు ఇతర మార్గాలను వెళ్లాల్సిన అవసరం అన్నారు. కాగా.. రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట, నార్సింగీ, బండ్లగూడ, మణికొండ ప్రాంతాలలో వర్షం పడుతోంది. దీంతో స్కూల్ వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి ఒక్కసారిగా వాతావరణం మారీ పోయింది. మరికాసేపట్లోనే వర్షం ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news