ఇదంతా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్లాన్… నా ఇంటి దగ్గరకు వచ్చిన వారంతా రైతుల కాదు: ఎంపీ అరవింద్

తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం సేకరణపై అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తుంటే…బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కౌంటర్ ఇస్తోంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు కేంద్రాలను 24 గంటల్లో తెరవాలని లేకపోతే గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులను తరిమికొడుతాం అంటూ వార్నింగ్ ఇచ్చింది. 

ఇదిలా ఉంటే ఆర్మూర్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి ముందు టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు వరి ధాన్యాన్ని పారబోసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ తెలంగాణ రైతులపై సవతి తల్లి ప్రేమ చూపినందుకే రైతుల ఇలా ధాన్యం పారబోసి నిరసన తెలుపుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రైతుల హక్కుల కోసం పోరాడుతాం అని… కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే ఈ ఘటనపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. నా ఇంటి దగ్గరకు వచ్చింది నిజమైన రైతులు కానది…కూలీకి వచ్చిన దినసరి కూలీలు అని, ఇదంతా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్లాన్ అంటూ విమర్శించారు.