మోదీ అమావాస్య రోజు రావాలి…. తెలంగాణను చూడాలి: మంత్రి జగదీష్ రెడ్డి

-

తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరు నడుస్తూనే ఉంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. దేశంలోని పరిస్థితులను తెలంగాణతో పోలుస్తూ టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి దేశంలోని కరెంట్ సమస్యలపై తనదైన శైలిలో విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ అమావాస్య రోజు హెలికాప్టర్ వేసుకొని వస్తే దేశములో ఎక్కడ వెలుగులు కనిపిస్తే అదే తెలంగాణ రాష్ట్రం అని సెటైర్లు వేశారు. దేశంలో పలు రాష్ట్రాల్లో బొగ్గు కొరత ఉందని… తెలంగాణలో ఆ సమస్య లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎంకు లోబడి అప్పులు తీసుకోవాలని అనేక ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. అభివృద్ధిలో ముందు ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని… కానీ తెలంగాణ రాష్ట్రాన్ని  ఎలా ముందుకు తీసుకుపోవాలో సీఎం కేసీఆర్ కు తెలుసని జగదీష్ రెడ్డి అన్నారు. టీఎస్ ఎస్పీడీసీఎల్ లో తొలిసారిగా లైన్ ఉమెన్ ఉద్యోగం పొందిన శిరీషకు నియామక పత్రాన్ని అందించి అభినందించారు జగదీష్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news