టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం – మంత్రి హరీష్ రావు

-

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో 6.5 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్ రావు. అలాగే మిషన్ భగీరథ పథకంలో భాగమైన పంప్ హౌస్ లను ప్రారంభించారు. అదేవిధంగా మహిళా భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్త ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పింఛన్లు ఇవ్వడం ద్వారా పేదలకు భరోసా కల్పిస్తున్నారని అన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజును చేసింది అన్నారు. సదాశివపేటలో 45 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షిత త్రాగునీరుని ఇచ్చామని తెలిపారు. సదాశివపేటలో 55 కోట్లతో మోరీలు, రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి చేయకుండా.. ఇక్కడ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో 2016 పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా.. ఇతర సంక్షేమ పధకాలు ఇవ్వడం లేదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news