66 పెండింగ్ చలాన్లు క్లియర్ చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే

-

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనకున్న వాహనాలకు సంబంధించిన మొత్తం చాలాన్లను చెల్లించినట్లు బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ ఆదివారం తెలిపారు. ఆయనకు చెందిన ఐదు వాహనాలపై 66 చాలాన్లు ఉన్నాయని, ఇందుకు సంబంధించి రూ. 37,365 చెల్లించినట్లు వివరించారు. కాగా రిజిస్ట్రేషన్ లేని వాహనాలు, బ్లాక్ ఫిలిమ్స్ పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దీనిలో భాగంగా శనివారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.

ఆ సమయంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం కారు అటుగా వచ్చింది. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాహనం అని చెప్పగానే దాన్ని వదిలేశారు పోలీసులు. ఈ క్రమంలోనే కారుపై 5 వేల చలాన్లు ఉన్నా కూడా పట్టించుకోవడం లేదని విమర్శలకు తావిచ్చింది. ట్రాఫిక్ పోలీసుల తీరును పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే దానం తనకున్న వాహనాలకు సంబంధించిన చలాన్లు చెల్లించినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news