తెలంగాణ భవన్​లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం

-

తెలంగాణ భవన్​లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో సీఎం కేసీఆర్ కొన్ని కీలక పరిణామాలపై చర్చిస్తున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, మరోసారి అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా.. సమగ్ర కార్యాచరణ అమలుపై టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసే ప్రధాన ఉద్దేశంతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో కలిసి సమన్వయంగా పని చేసేలా నియోజవకవర్గానికి ఓ ఇంఛార్జీని నియమించనున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఎన్నికల్లో చోటుచేసుకున్న పలు పరిణామాలపై భేటీలో చర్చించనున్నారు.

తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రాష్ట్ర నాయకుల వరకు బీజేపీ పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్న తరుణంలో ఎలా తిప్పికొట్టాలనే అంశంపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎమ్మెల్యేలకు ప్రలోభాలు వెలుగు చూసినందున.. ప్రజాప్రతినిధులకు గులాబీ దళపతి కీలక సూచనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సిట్టింగ్​లకు మళ్లీ అవకాశమిస్తామని.. గతంలోనే పలు సందర్భాల్లో చెప్పిన పార్టీ అధినేత మరోసారి వారికి భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news